Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సరూర్‌నగర్
విద్య శాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి తనయుడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆర్కే పురంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ నెంటురి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున , పార్టీ శ్రేణుల సమక్షంలో కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆర్కేపురం డివిజన్, యాదవ నగర్ కాలనీలోని సిరి అనాధ ఆశ్రమంలో వద్ధులకు దుప్పట్లు, పండ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో చిన్న వయసులోను మంచి పేరు తెచ్చుకొని ప్రజలకు సేవచేయడం లో కార్తిక్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారని ఆయన కొనియాడారు. ముఖ్యంగా భవిష్యత్‌లో కేసీఆర్, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ఆశీర్వాదంతో మంచి పదవులను అలంకరించాలని అభిలషిించారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ వీరమళ్ల రామ్ నర్సింహగౌడ్, చిత్ర లే ఔట్ కాలనీ అధ్యక్షుడు ముస్కు అంజిరెడ్డి, బిరెళ్లి వెంకట్ రెడ్డి, న్యాలకొండ శ్రీనివాస్ రెడ్డి, మారోజు రామాచారి, కొండ్ర శ్రీనివాస్, లింగుస్వామిగౌడ్, జగన్ మోహన్ రెడ్డి, పెంబర్తి శ్రీనివాస్, పుష్పలత, మహ్మద్, అల్లావుద్దీన్ పటేల్, బండారు మల్లేష్ , నరేందర్‌గౌడ్, వాజిద్ పటేల్, రమేష్, జవీద్ పటేల్, ప్రశాంత్, నాగరాజు, సత్యనారాయణరెడ్డి, శంకర్‌గౌడ్, హమీద్, యాదమ్మ, రుకియా, మునేమ్మ పాల్గొన్నారు.