Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎల్వి బేకరీకి పదివేల రూపాయల జరిమానా
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
కుళ్ళిన ఆహారాన్ని విక్రయిస్తున్న బేకరీ అంటూ నవతెలంగాణ దినపత్రికలో బుధవారం వచ్చిన కథనానికి అబ్దుల్లాపూర్మెట్ మండల పంచాయతీ అధికారులు స్పందించి ఎస్ఎల్వి. బేకరీకి పదివేల రూపాయల జరిమానా విధించారు. మండల ఎంపీడీవో మమత బాయి, ఎంపీఓ వినోదల ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ అధికారులు జరిమానా విధించినట్లు తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో హోటల్స్, బేకరీలు, ఆహార పదార్థాలను విక్రయించే సముదాయాలు తప్పనిసరిగా పరిశుభ్రతను పాటించి, ప్రజా ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. తప్పనిసరిగా వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్సులు పొందాలని, లేని వారు ట్రేడు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ట్రేడ్ లైసెన్సులు తీసుకోకుంటే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ట్రేడు లైసెన్సులు లేని వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.