Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందేల శ్రీరాములు యాదవ్
నవతెలంగాణ-బడంగ్పేట్
యువతీ,యువకులకు క్రీడలతోనే మానసిక ఉల్లాసంతో పాటు మనోధైర్యం కలుగుతుందని బీజేపీ రాష్ట్ర నాయకులు, మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందేల శ్రీరాములు యాదవ్ అన్నారు. బుధవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న గుర్రంగూడలో క్రికెట్ ఆడుకునేందుకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్పోర్ట్స్ బాక్స్ ప్రారంభోత్సవానికి మార్చి 6 తేదీన ముఖ్య అతిథిóగా రావాలని గుర్రంగూడ 6వ డివిజన్ కార్పొరేటర్ దడిగ శంకర్ ఆధ్వర్యంలో నాదర్గుల్లోని పార్టీ కార్యాలయంలో అందేల శ్రీరాములు యాదవ్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు కడారి జంగయ్య, బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.