Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రేటర్లో 5వేల స్వచ్చ ఆటోలతో చెత్త సేకరణ
- పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్
- చెత్త తరలించే వాహనాలు ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
అత్యాధునిక, మెరుగైన పద్ధతిలో హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా చేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి తారక రామారావు అన్నారు. బుధవారం నెక్లెస్ రోడ్డులో ఆధునిక సాంకేతిక పద్ధతిలో వ్యర్థాలను తరలించే వివిధ రకాల వాహనాలను మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేష్ కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి, రాంకీ సీఈఓ గౌతమ్‌రెడ్డితో కలిసి 60 వాహనాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ముఖ్యంగా నగరాల్లో ఘన, ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించారనీ, అప్పుడే సమగ్రమైన, అర్థవంతమైన, ఆచరణాత్మకంగా ప్రాక్టికల్ ఎజెండా తీసుకుని హైదరాబాద్ నగరంలో ఉత్పత్తి అవుతున్న వ్యర్ధాల సేకరణ పూర్తి స్థాయిలో పరిష్కారం చేసినట్టు తెలిపారు. 2013-14లో 2500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అయ్యేదనీ, సీఎం ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ రాంకీ కలిసి కట్టుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు 6500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను 4500 స్వచ్ఛ ఆటోల ద్వారా సేకరిస్తున్నట్టు తెలిపారు. మరో 400 స్వచ్ఛ ఆటోలు నెల రోజుల్లో రానున్నట్టు చెప్పారు. 2015లో 2500 స్వచ్ఛ ఆటోలు ప్రారంభించి, 650 ఆటోలు 2020లో గతేడాది డిసెంబర్లో 1350 ఆటోలు పంపిణీ చేశామనీ, మరో 400 ఆటోలు నెల రోజుల్లో వస్తున్న నేపథ్యంలో మొత్తం 5000 ఆటోలతో జీహెచ్ఎంసీ పరిధిలో గల 150 డివిజన్లో ప్రాథమిక దశలో చేపట్టే ఇంటింటికీ తిరిగి సేకరణ సమర్థవంతంగా జరుగుతుందన్నారు. హైదరాబాద్ విశ్వ నగరంగా అభివృద్ధి చేసే స్థాయిలో ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిప్యూజ్ కంటైనర్ వెహికల్, హుక్ మౌంటెడ్ వెహికల్, సిలిండ్రికల్ స్టాటిక్ కంటైనర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. చెత్త రోడ్లపై వెదజల్లేందుకు అధివృద్ధి చెందిన దేశాల్లో ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు ఏ విధంగా ఉంటుందో ఆ రకమైన ఏర్పాట్లు హైదరాబాద్‌లో కూడా చేస్తున్నామన్నారు. నగరంలో 17 ట్రాన్స్పోర్ట్ స్టేషన్లను నిర్వహిస్తుండగా అందులో 11 ఆధునీకరించామనీ, మరో 4 ప్రగతిలో ఉన్నాయనీ, మిగతా 2 కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాటు చేసిన 17 ట్రాన్స్పోర్ట్ స్టేషన్ చుట్టూ పక్కల ప్రజలకు ఎలాంటి దుర్గంధం, ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. 17 ట్రాన్స్ఫర్ స్టేషన్లు సరిపోకపోతే 150 డివిజన్లలో 95 సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్లయితే ప్రాథమిక స్థాయిలో సేకరణ తర్వాత తరలింపు దూరం కాకుండా స్వచ్ఛ ఆటోలు కూడా రోజువారీ సేకరణ వందకు వంద శాతం వీలౌతుందన్నారు. నగరంలో 24 స్టాటిక్ ఎస్టీపీలతో పాటుగా 71 మొబైల్ ఎస్టీపీలు కాగా ఇప్పుడు మరో 20 మొబైల్ ఎస్టీపీల ఏర్పాటుకు ఆర్‌సీవీ వాహనాలు, 64 హుక్ మౌంటెడ్ వెహికిల్, మరో 20 వాహనాలు, సిలిండ్రికల్ స్టాటిక్ కంటైనర్ 76 కాగా మరో 20 వాహనాలు మొత్తం 60 వాహనాలను ప్రారంభించి అందుబాటులోకి తెస్తు న్నట్టు తెలిపారు. దక్షిణ భారతదేశంలో వ్యర్థాల నుంచి అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రూ.485 కోట్లతో 24 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించామనీ, మరో 24 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని రూ.550 కోట్లతో నిర్మాణం చేస్తున్నట్టు చెప్పారు. జవహర్‌నగర్ డంప్‌యార్డులో పేరుకుపోయిన వ్యర్థాల వల్ల చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా రూ.140 కోట్లతో క్యాపింగ్ చేయడంతోపాటు వర్షాల కారణంగా డంప్‌యార్డులోని వ్యర్థాల కారణంగా ఏర్పడిన లీచెట్ వల్ల చెరువులు కలుషితం కాకుండా రూ.250 కోట్లతో ట్రీట్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు. ఘన వ్యర్థాలతో పాటు ద్రవ వ్యర్థాల ట్రీట్మెంట్కు కూడా ప్రాధాన్యతనిస్తూ రూ.3,866 కోట్లతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నగరంలో చెరువుల్లో వ్యర్థాలు, గుర్రపు డెక్క తొలగింపునకు అత్యాధునిక పద్దతిలో శుభ్రం చేస్తున్నామనీ, అందుకోసం ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్ జీహెచ్ఎంసీకి ఆరు వాహనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేట్ పి.విజయారెడ్డి, హెల్త్ అండ్ శానిటరీ అడిషనల్ కమిషనర్ బి.సంతోష్, జాయింట్ కమిషనర్ సంధ్య, జోనల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, రవికిరణ్, హౌసింగ్ ఓఎస్డీ సురేష్‌కుమార్, ఎస్ఈ కోటేశ్వరరావు, రాంకీ జేఎండీి మాసూద్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.