Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మోండా డివిజన్ వెస్ట్ మారేడ్ పల్లిలో 5.18 ఎకరాల విస్తీర్ణంలో రూ.36.27 కోట్లతో నిర్మించిన 468 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గురువారం మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుధవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న హౌసింగ్, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రారంభోత్సవ కార్యక్ర మానికి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు తెలిపారు. మారేడు పల్లిలో డబుల్ ఇండ్లతోపాటు రూ.3.51 కోట్లతో రోడ్లు, డ్రయినేజీ, విద్యుత్ సౌకర్యాలు కల్పించడంతో పాటు, మంచినీటి సౌకర్యం కోసం 50 వేల లీటర్ల సామర్థ్యం గల 4 సంపులను కూడా ఏర్పాటు చేశారు. పేదలు కష్టాలను చూసి ఆరేండ్ల క్రితం అధికారులు హౌసింగ్ బోర్డుకు చెందిన ఈ స్థలంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సీఎం కేసీఆర్ దృష్టికి తాను ఈ ప్రాంతంలోని పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే సాయన్న తీసుకెళ్లారనీ, స్పందించిన సీఎం వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేశారని తెలిపారు. సీఎం చొరవతో ముందుగా హౌసింగ్ బోర్డ్‌కు చెందిన ఈ స్థలాన్ని రెవెన్యూశాఖకు బదిలీ చేసి లబ్దిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లను పంపిణీ చేసినటఱ్టు పేర్కొన్నారు. పేద ప్రజలు అన్ని వసతులు, సౌకర్యాలు కలిగిన సొంత ఇంటిలో సంతోషంగా, ఎంతో గొప్పగా బతకాలనేది సీఎం లక్ష్యం అన్నారు.