Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
ఉక్రెయిన్పై రష్యన్ సామ్రాజ్యవాదం సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఆపాలనీ, శాంతి చర్చలు కొనసాగించాలని సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాంనగర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) (న్యూడెమోక్రసీ) హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కార్యదర్శి జి.ఝాన్సీ మాట్లాడుతూ ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. యుద్ధం అంటేనే విధ్వంసం అనీ, చిన్న పిల్లలతో సహా అనేకమంది మరణించడం బాధాకరం అన్నారు. రష్యా చేస్తున్న యుద్ధాన్ని, నాటో కూటమి కొనసాగిస్తున్న యుద్ధోన్మాద చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇరు దేశాల మధ్య చర్చల ద్వారా శాంతిని పునరుద్ధరించాలన్నారు. యుద్ధంలో ఉక్రెయిన్లో ఉన్న సాధారణ ప్రజలు అనేక మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారనీ, లక్షలాది మంది నిరాశ్రయులు అవుతున్నారన్నారు. యుద్ధాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు తగ్గి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతా యన్నారు. యుద్ధం ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందనీ, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజానీకానికి మనుగడ కష్టం అవుతుందన్నారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారత విద్యార్థులను యుద్ధ ప్రాతిపదికన ఇండియాకి రప్పించా లనీ, లేదంటే నవీన్ లాంటి అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. యుద్ధాలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు అరుణ, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి మహేష్, పీఓడబ్ల్యూ నగర అధ్యక్ష కార్యదర్శులు అనసూయ, కావేరి, సుజాత, పుష్ప, పీడీఎస్యూ నాయకులు శివాజీ వికాస్, సాయికృష్ణ, గౌతం, గణేష్, తదితరులు పాల్గొన్నారు.