Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కేంద్రప్రభుత్వం రోడ్డు సేఫ్టీ బిల్లు తీసుకొచ్చి వాహనదారులను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని సీఐటీయూ సికింద్రాబాద్ కన్వీనర్ టి.మహేందర్ అన్నారు. అడ్డగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు నడిపించే 80 మంది ఆటోడ్రైవర్లతో బుధవారం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్నాయ న్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29 లేదీల్లో దేశవ్యాప్తంగా జరిగే బందులో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2002లో బురెలాల్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆసరా చేసుకుని డీజిల్ ఆటోలు హైదరాబాద్లో నడపకూడదనీ, పొల్యూషన్ పెరుగుతుందనే కారణాలతో అటో డ్రైవర్లను వేధించటం దుర్మార్గం అన్నారు. హైదరాబాద్లో వేరే జిల్లాల ఆటోలు నడుపొద్దంటే డీజిల్ అటోలకు టీజీ 9బీ13 నెంబర్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా టి.మహేందర్, అధ్యక్షులుగా కైలాష్ రావణ్, కార్యదర్శిగా మహేష్, ఉపాధ్యక్షులుగా శివ, చిన్న, భీమేష్, మైకేల్, నర్సింగరావు, మహేష్ రాజ్, భాను, సహాయ కార్యదర్శులుగా సాయి, అసిఫ్, శివకుమార్, ఈర్ల మహేష్, కృష్ణ, శ్రీనివాస్, అనిల్, సభ్యులుగా వినరు, ఆఫ్రోజ్, దశరథ్, వేణుగోపాల్, బెంజ్మెన్, రఫిక్, ఆనంద్, నందు, మధు, పర్షురాం, జనత్, చిన్న పాల్గొన్నారు.