Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ దర్శకులు వి.ఎన్.ఆదిత్య
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆత్మీయత అనుబంధాలకు అన్నమయ్య కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని ప్రముఖ సినీ దర్శకులు వి.యన్.ఆదిత్య అన్నారు. బుధవారం బేగంపేటలో నిర్వహించిన సమావేశంలో అన్వయ కిన్ కేర్ ప్రయివేట్ లిమిటెడ్ లోగో తోపాటు సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలియజేస్తూ సంస్థ ఫౌండర్ సీఈవో ప్రశాంత్ రెడ్డి, డైరెక్టర్ దీపా రెడ్డి, హీరో ధీరజ్ అశ్విన్‌ల చేతుల మీదుగా ప్రారంభించారు. దర్శకులు ఆదిత్య మాట్లాడుతూ ఆత్మీయత అనుబంధాలు పంచే కేంద్రంగా అన్వయ కేర్ నిలుస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో తాను దర్శకత్వం వహించిన ఇద్దరి మధ్యలో చిత్రంలో అన్వయ నిలుస్తుందని తెలిపారు. వ్యక్తిగతికరించిన డేమిష్య(చిత్త వైకల్యం) సంరక్షణ పథకాన్ని విడుదల చేసిన అన్వయ వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పెద్దల అవసరాలను తీర్చే సంరక్షణ ప్రణాళికనూ విడుదల చేస్తున్నట్లు సంస్థ యజమాని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సిబ్బంది అధికారులు తప్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.