Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ప్రముఖ ఆంధ్ర నాట్య గురువు, తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్ర నాట్యం శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ సువర్చలా దేవి బుధవారం ఉదయం గుండె పోటుతో మరణించారు. ఆమె వయస్సు 53 ఏండ్లు. కుమార్తె, కుమారుడు ఉన్నారు. చిన్న ఆరోగ్య సమస్యతో ఒక ప్రయివేట్ హాస్పిటల్లో పరీక్ష ల కోసం వెళ్లగా గుండె పోటుతో అక్కడే మరణించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సువర్చల ప్రాచీన సంప్రదాయ నత్యకళను సరిదే మణిక్యమ్మ, డాక్టర్ నటరాజ రామకష్ణల వద్ద సుశిక్షుతురాలైనారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి ఆంధ్ర నాట్యంలో ఎంపీఏ, పీహెడీ చేసి తెలుగు విశ్వవిద్యాలయంలో రెండు దశాబ్దాలుగా ఆంధ్ర నాట్య శాఖ లో పనిచేస్తున్నారు. అభినయ అకాడమి ఆఫ్ అంధ్ర నాట్యం సంస్థను స్థాపించి ఎందరినో ఆంధ్ర నాట్యంలో తీర్చిదిద్దుతున్నారు. సువర్చల మతి పట్ల విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య టి. కిషన్ రావు దిగ్భ్రాంతి చెందారు. అధ్యాపక బందం, ఉద్యోగ సిబ్బంది సంతాపం ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ, సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ సువర్చల తెలంగాణలో అత్యున్నత నాట్య కళాకారిణి అని, ఆమె మతి అంధ్ర నాట్యం పెరిణి నాట్య రంగంకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కథక్ నాట్య గురువులు రాఘవ రాజ్ భట్, అంజి బాబు, కూచిపూడి నాట్య గురువులు డాక్టర్ రామ దేవి, సుష్మ, వనజా ఉదరు, ప్రవల్లిక తదితరులు గానసభ అధ్యక్షులు కళా జనార్దన మూర్తి, సాంస్కతిక సంస్థలు వంశీ రామ రాజు, రసమయి డాక్టర్ రాము, కిన్నెర రఘురామ్, కళా నిలయం సురేందర్ యువ కళా వాహిని లంక లక్ష్మి నారాయణ, సారిపల్లి ఫౌండషన్ సారిపల్లి కొండలరావు, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివా రెడ్డి, కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య తదితరులు సంతాపం ప్రకటించిన వారిలో ఉన్నారు. సువర్చల అంత్యక్రియలు వనస్థలిపురం శ్మశాన వాటికలో నిర్వహించారు.