Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాంతిభద్రతలపై సమీక్షలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
నతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో మతపరమైన, రాజకీయ కార్యక్రమాలపై నిఘా పెట్టాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సిటీ పోలీసు కమిషనరేట్‌లో శాంతిభద్రతలపై డివిజన్ ఏసీపీలు, జోనల్ అడిషినల్ డీసీపీలు, డీసీపీలు, జాయింట్ సీపీలు, అడిషినల్ సీపీలతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ మతపరమైన పరిస్థితులలో పోలీసుల ప్రతిస్పందన ఏవిధంగా ఉండాలనినేది వివరించారు. మతపరమైన, రాజకీయ సమూహాల వివిధ కార్యకలాపాలపై పోలీసు నిఘాను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ సిటీలోకి కొత్తగా పోస్టింగ్‌లపై వచ్చిన ప్రొబేషనరీ ఎస్ఐలు ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా అలవాటు చేసుకోవాలన్నారు. ఎస్ఐలు, ఉమెన్ ఎస్ఐ, ఇన్స్పెక్టర్ల పనితీరుపై చర్చించినట్టు తెలిపారు. ఎఫెక్టివ్ పోలీసింగ్ ఆవశ్యకత, హోంగార్డు నుంచి పైఅధికారి వరకు, ప్రతి ఒక్కరూ తమ విధులను బాధ్యతాయుతంగా నెరవేర్చాలని అన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాలు, పండుగల సీజన్‌కు సన్నద్ధతపై కూడా చర్చించారు.