Authorization
Sun March 23, 2025 06:00:40 am
నవతెలంగాణ-హయత్‌నగర్
మన్సురాబాద్ డివిజన్లో చింతలకుంట నేషనల్ హైవే రోడ్డు సరస్వతీనగర్ అండర్‌పాస్ వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్త కుండా రోడ్డుకు ఆనుకొని ఉన్న వ్యాపార డబ్బాలను లోపలకు జరిపించాలని చెబితే ఎన్నో యేండ్ల నుండి ఉన్న కాలనీ కమాన్‌ను తొలగిస్తుంటే కాలనీవాసులతో కలిసి మంగళ వారం కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మారెడ్డి డీఆర్ఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ సరస్వతీ నగర్ రోడ్డు దాదాపు 30 కాలనీలకు నేషనల్ హైవే రోడ్డుకు ప్రధానమైన రహదారి అని, తరచూ ఈ ప్రదేశంలో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నా సమస్యలను పరిష్కరించమంటే ఇలా స్వార్ధ ప్రయోజనాల కోసం బహిరంగంగా స్క్రాప్‌ను అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రైవేట్ నిర్వహణలో ఈడీిఆర్ఎఫ్ ఎన్ఫోర్స్ మెంట్ ఎన్నో అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాం తులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.