Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి
నవతెలంగాణ-బేగంపేట
సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో కొవిడ్ స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. మొదటి కోవిడ్ కేసు నమోదై నేటితో రెండేండ్లు పూర్తి కావడంతో గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ఆధ్వర్యంలో అల్యూమినీ భవనంలో బుధవారం కొవిడ్‌ను ఎదుర్కోవడంలో సేవలందించి అశువులు బాసిన సిబ్బందికి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా కొవిడ్ సమయంలో ఎదుర్కొన్న సమస్యలు, అనుభవాలు, సేవలు, అప్పటి పరిస్థితులను నెమరవేసుకున్నారు. అనంతరం డీఎంఈ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ కొవిడ్ మహమ్మరిని ఎదుర్కోవడంలో గాంధీ వైద్యులు, యావత్ సిబ్బంది, పోలీసులు చేసిన సేవలు అద్వితీయమని ప్రశంసించారు. గాంధీ హాస్పిటల్ అందించిన సేవలు ప్రపంచంలో ఏ హాస్పిటల్ కూడా అందించలేదన్నారు. అత్యధికంగా 85వేలకు పైగా రోగులకు సేవలందించడం ప్రపంచ రికార్డుగా చెప్పుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్‌లోని అన్ని విభాగాల అధిపతులు, వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.