Authorization
Wed March 19, 2025 05:55:47 am
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం కోసం, చదువు, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి అంశాలపై సైకాలజిస్టుల ఆధ్వర్యంలో కోఠిలో ఈనెల 5న అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మహేంద్ర హెర్బల్ హెల్త్ డాక్టర్ మహేందర్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం కోఠిలో ఆయన మాట్లాడుతూ కోవిడ్ అనంతరం అయోమయంలో ఉన్న విద్యార్థుల జ్ఞాపకశక్తి సమస్యలు పారద్రోలేలా సూచనలు ఇస్తామని చెప్పారు. ఆన్లైన్ పాఠాల తర్వాత సన్నగిల్లిన ఆత్మస్థైర్యం, చదువుపై శ్రద్ధ కలిగేలా ఏకాగ్రత సాధించేలా చూస్తామన్నారు. బద్దకం, కుంగుబాటు, అతిచలాకీ తనం సమస్యలకు నివారణకు ప్రముఖ మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. ఇతర వివరాలకు 8688721472 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.