Authorization
Tue March 18, 2025 05:17:58 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ హాస్టల్ ఇచ్చేదేలే అంటూ విద్యార్థులు గురువారం వీసీ ఛాంబర్ ఎదుట బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు వారు ఓయూ ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యా నాయక్‌తో ఈ విషయంలో వాగ్వాదానికి దిగారు. 'ప్రతి అడ్డమైన వారికి సమాధానం చెప్పాలా' అని ఓఎస్టీ అనటంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఉన్నతమైన హోదాలో ఉన్న ఓఎస్డీ విద్యార్థులను ఇలాగే అంటారా? అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థినిలకు హాస్టల్ ఇవ్వాలని కళాశాల ప్రిన్సిపాల్‌పై, అధ్యాపకులపై ఒత్తిడి తీసుకురావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓయూ అధికారులు ఎన్ని చేసిన తమ హాస్టల్ ఇవ్వమని, దాని కోసం పోరాటాలు చేస్తాం అంటూ హెచ్చరించారు.