Authorization
Wed March 19, 2025 02:15:35 pm
- రూమ్ క్లీన్ చేస్తుండగా వార్డు బారు తలకు గాయాలు
- వసతిగృహం మార్చాలని విద్యార్థుల ధర్నా
నవతెలంగాణ-ఓయూ
'ఓయూ కృష్ణవేణి (బి హాస్టల్)లో ఉండలేం' అంటూ విద్యార్థులు గురువారం ఓయూ పరిపాలనా భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూమ్ క్లీన్ చేస్తుండగా వసతిగృహం రూఫ్ నుంచి కొన్ని పెచ్చులు ఊడిపడి వార్డ్ బారు యాదగిరి అనే వ్యక్తి తలకు గాయాలయ్యాయని చెప్పారు. విద్యార్థులకు కూడా గాయాలు అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు. రోజురోజుకూ పెచ్చులు ఊడిపడుతున్న నేపథ్యంలో తమకు వేరే హాస్టల్ ఇవ్వాలని, గాయపడ్డ యాదగిరిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. అనంతరం జనరల్ స్టూడెంట్ రాజు ఆధ్వర్యంలో ఓయూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.