Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ని రాజకీయంగా ఎదుర్కోవడం సాధ్యం కాదనుకొని, అతన్ని అంతం చేయాలని కుట్ర చేయడం దుర్మార్గమైన చర్య అని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ అన్నారు. మంత్రిపై హత్యకు కుట్రపన్నిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ధి వైపు ముందుకుతీసుకెళ్తున్న మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌పై కొందరు మొదటి నుంచి కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయనకు బడుగు, బలహీన వర్గాలు, గౌడ ఐక్యసాధన సమితి ఎల్లవేలలా అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు బబ్బురి బిక్షపతి గౌడ్, రాష్ట్ర నాయకులు పులి శివకుమార్ గౌడ్, అధికార ప్రతినిధులు కొప్పుల రవీందర్ గౌడ్, లింగాల హరీష్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు ఎర్ర శ్రీ నివాస్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ కార్యనిర్వహణ అధ్యక్షుడు నేమురి సాయిరాం గౌడ్, ప్రధాన కార్యదర్శి గోగరి సుధకర్ గౌడ్, నాయకులు బైరగోని సదానందం గౌడ్, రేపల్లి శ్రీనివాస్ గౌడ్, సుమన్ గౌడ్, నీలాంబర్, సాయి రోహిత్, అనిల్ గౌడ్ కుమార్ పాల్గొన్నారు.