Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
గౌడ ఐక్య సాధన సమితి గ్రేటర్ హైదరాబాద్ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా మేడ్చల్ జిల్లా అల్వాల్‌కు చెందిన నేమూరి సాయిరాం గౌడ్ నియమితులయ్యారు. గురువారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్బంగా అంబాల నారాయణ గౌడ్ మాట్లాడుతూ గౌడ సమాజం అభివద్ధికి పాటు పడాలని సాయిరాం గౌడ్‌కి సూచించారు. సంఘం కోసం నిస్వార్థంగా పని చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందన్నారు. సాయిరాం గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కతజ్ఞతలు తెలియజేశారు. గౌడ సమాజం అభివద్ధికి శక్తి వంచన లేకుండా కషి చేస్తానని హామీ ఇచ్చారు.