Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిటీబ్యూరో : జై శ్రీనివాస్ (నేరేడుకొమ్మ శ్రీనివాస్) కుటుంబాన్ని ఆదుకోవాల ని సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు కె.ఈశ్వర్రావు, వెంకటేష్ కోరారు. జై శ్రీనివాస్ కరోనా వైరస్‌తో చనిపోవడం తెలంగాణకు తీరని లోటని సంతాపం ప్రకటించారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో సీఎం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. జై శ్రీనివాస్ మృతి తర్వాత ఆ గాయకుని కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటో ందనీ, కనీసం సొంత ఇల్లు కూడా లేదన్నారు. ఇద్దరు ఆడపిల్లలు చదువులు కూడా ఆగిపోయే పరిస్థితి ఉందనీ, ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. భార్య స్వాతి అభ్యర్ధనను అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక తెలంగాణ గాయకుని గుండె చప్పుడు అర్దాంతరంగా ఆగిపోవటం చాలా బాధాకరమని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు చెందిన 'చిత్రపురి హౌసింగ్ సొసైటీ'లో ఇల్లు ఇప్పించాలనీ, ఆ ఇద్దరు ఆడపిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు.