Authorization
Mon March 17, 2025 10:46:02 pm
- బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్
- సామల బుచ్చిరెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 20, 21వ డివిజన్ పరిధిలోని రాఘవేంద్రనగర్, ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో వరదల సమయంలో ఇండ్లలలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు వరదనీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు గాను రా చెరువు నుంచి సుద్దకుంట వరకు బాక్స్ నాలా పనులను రూ.2 కోట్లతో పూర్తి చేసేందుకు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే వర్షాకాలంలో ఎలాంటి వరద కష్టాలు లేకుండా చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జడిగే మహేందర్ యాదవ్, భుక్య సుమన్ నాయక్, డీఈ కుర్మయ్య, టీఆర్ఎస్ నాయకులు తోటకూర శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.