Authorization
Wed March 19, 2025 08:33:49 pm
నవతెలంగాణ-సంతోష్‌నగర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆదేశాల మేరకు శుక్రవారం యాకత్పురా నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి సామ సుందర్ రెడ్డి అధ్యక్షతన అన్ని డివిజన్ అధ్యక్షులతో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ ఆదివారం పలు డివిజన్ పరిధిలోని కుర్మగూడ, సంతోష్ నగర్, తలాబ్ చంచలం డివిజన్ పరిధిలో కేసీఆర్ ఫ్లెక్సీలతో రాఖీ కట్టడం, డివిజన్ పరిధిలో గల పారిశుధ్య కార్మికులను సన్మానిస్తామని చెప్పారు. సోమవారం ఐఎస్ సదన్ డివిజన్ ఆవరణలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మహిళల పెన్షన్లు లబ్ధి పొందిన వారితో సెల్ఫీ ఫోటోలు, మంగళవారం గౌలిపుర డివిజన్ పరిధిలోని మహిళలతో సమావేశం మహిళల దినోత్సవం సంబరాలు వేడుకలలో అంతర్జాతీయ దినోత్సవం మహిళకు సంక్షేమ పథకాల గురించి వివరించారు.