Authorization
Sun March 16, 2025 11:22:35 pm
- కార్పొరేటర్ పావని వినరు కుమార్
నవతెలంగాణ-అడిక్మెట్
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యతను పాటించి లోటుపాట్లు లేకుండా త్వరగా పూర్తి చేయాలని గాంధీ నగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ అధికారులకు విన్నవించారు. శుక్రవారం గాంధీ నగర్ రోడ్డు విస్తరణ పనులను డిప్యూటీ ఇంజినీర్ సన్ని, అసిస్టంట్ ఇంజినీర్ శ్రావణి లతో కలిసి పర్యవేక్షించారు. పనులను 20 రోజులు పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పనుల్లో నాణ్యత పాటించి లోటుపాట్లు కలవకుండా త్వరగాతిన రోడ్డు పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో బీజేపీ యువ నాయకులు వినరు కుమార్, వంజరి నవీన్, బాలకష్ణ, సాయి కుమార్, ఆనంద్ రావు, అరుణ్ కుమార్, సంతోష్, స్థానికులు పాల్గొన్నారు.