Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని టీడీపీ నగర నాయకులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు పి.సాయిబాబా నేతృత్వంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ... పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో యువత ఆశలను టీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న సీఎం హామీ ఏమైందని ప్రశ్నించారు. 'మీ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వస్తే చాలా? ' అని ప్రశ్నించారు. నీళ్లు నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి ఏడున్నరేండ్లలో ఏం చేశారని నిలదీశారు. ఖాళీగా వున్న లక్షా 91వేల 126 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు శ్రీపతి సతీశ్, ప్రధాన కార్యదర్శి పి.బాలరాజ్‌గౌడ్, కార్యనిర్వహక అధ్యక్షులు నల్లెల్ల కిషోర్‌తోపాటు వల్లారపు శ్రీనివాస్, నగు నగేష్, పెద్దోజు రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.