Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న పహాడి షరీఫ్ ప్రభుత్వ పాఠశాల భవనాల సాధన కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసంలో కలసి పాఠాశాల ముందు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పాఠశాలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహాడి షరీఫ్ ప్రభుత్వ పాఠాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఆట స్థలం లేకపోవటంతో పాటు పాఠాశాలలో ఇరుకైన తరగతి గదులు ఉండటం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల సౌకర్యం కోసం పాఠాశాల ముందు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పాఠాశాల విద్యార్థుల కోసం కేటాయించాలని కోరారు. బాలాపూర్ మండల విద్యాధికారి కష్ణ, పాఠాశాల ఉపాధ్యాయులు దస్తగిరి, సీఆర్పీఎఫ్ సభ్యులు జిల్లా కో కన్వీనర్ బర్కత్ అలీ, హమీద్, మదర్స్ జిల్లా కోకన్వీనర్ పెంటమ్మ, ఎంవిఎఫ్ ఫౌండేషన్ నాయకులు వెంకటస్వామి, సరిత పాల్గొన్నారు.