Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ పారిజాత నర్సింహ్మరెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం వరద కాల్వల నిర్మాణం చేసి ప్రజల ఇబ్బందులను తొలగించుటకు కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయటం జరిగిందని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మారెడ్డి అన్నారు. శనివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని 20వ డివిజన్లో వర్షపు నీరు వెళ్లుటకు మెయిన్ ట్రంక్ లైన్ నిర్మాణ పనులను మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి స్థానిక కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా అధిక వర్షాల కారణంగా వరద కాల్వలు లేకపోవటం, కొన్ని కాలనీలు నీట మునిగి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమస్యను కార్పొరేటర్లు, కాలనీవాసులు తమ దష్టికి తీసుకురావడంతో కాలనీలో పర్యటించి సమస్యను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వివరించడం జరిగిందని, మంత్రి చొరవతో వరద కాల్వల నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్తో మాట్లాడి ప్రత్యేక నిధులు మంజూరు చేయటం జరిగిందని, ఆ నిధులతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో కార్పొరేషన్లో నిరంతరం ప్రజా సమస్యల పరిస్కారం కోసం కషి చేస్తున్నామని తెలిపారు. అభివద్ధి పనులు త్వరగా పూర్తి చేసి ఈ వర్షాకాలంలోపు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమస్యలన్నీ అధిగమించేందుకు ఎల్లవేళలా తాము, కార్పొరేషన్ అధికారులు పనిచేస్తున్నామన్నారు. గ్రీన్ రిచ్ కాలనీ నుండి మీర్పేట్ పెద్ద చెరువు వరకు ఈ నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుర్రం మల్లారెడ్డి, బాబుల్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, కార్యకర్తలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.