Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కేసీఆర్ను గద్దె దించాల్సిందే అని రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ మందకృష్ణ మాదిగ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం హైదరాబాద్లో ఏప్రిల్ 4న లక్షలాది మందితో నిర్వహించే యుద్ధభేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, వీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు బాబు మహాజన్ ఆధ్వర్యంలో శనివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థి యుద్ధభేరి బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మందకష్ణ మాదిగ మాట్లాడుతూ రాచరిక పరిపాలనకు, నియంతత్వానికి, కుటుంబ వారసత్వ రాజకీయాలకు రాజ్యాంగం అడ్డుగా ఉందనే కారణంలో రాజ్యాంగాన్ని మార్చాలని దుర్మార్గమైన కుట్రకు తెర లేపారని అన్నారు. కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పడానికే రాజ్యాంగ పరిరక్షణ పోరాటానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ యాత్రలో విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థి వేదిక ప్రతినిధులు రుద్రవరం లింగస్వామి మాదిగ, చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, సయ్యద్ సలీం పాషా, మాసంపల్లి అనిల్ కుమార్, కొమ్ము శేఖర్ మాదిగ, ప్రశాంత్, నరేందర్, తోకల చిరంజీవి మాదిగ, మామిడి కరుణాకర్, శనిగరపు మురళీ కష్ణ, పల్లెర్ల సుధాకర్, వెంకట్ గళ్ల వెంకట్, రామారాపు శ్రీనివాస్, బుషిపక గణేష్, ఈరెంటి విజరు, శివ, ప్రణరు, ఆదిత్య, వేణు పాల్గొన్నారు.