Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లి భగత్ సింగ్ నగర్ గుడిసెలలో ఇటీవల ప్రమాదవశాత్తు ఇల్లు కోల్పోయిన బాధితులకు శనివారం పీవీకే టీం అధ్వర్యంలో బాధిత కుటుంబానికి పుస్తకాలు, బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీం సభ్యులు విజేందర్ మహేష్ మాట్లాడుతూ బాలమణీ కుటుంబానికి భవిష్యత్తులో అండగా నిలుస్తామని అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబానికి చేయూతను అందించడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని విమర్శించారు.