Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా. విశారదన్ మహారాజ్
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యస్థాపనకు 10 వేల కిలోమీటర్ల పాదయాత్రను మార్చి 15న కల్వకుర్తిలో ప్రారంభిస్తామని దళిత శక్తి ప్రోగ్రాం (డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు డా. విశారదన్ మహారాజ్ తెలిపారు. శనివారం ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వరాజ్య పాదయాత్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీల స్వధర్మాన్ని (ఫిలాసఫీ) విద్యావంతులైన వారందరికీ తెలియజేసి, అగ్రకులాలు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో తెలియపరుస్తామమన్నారు. 2022 మార్చి 15 నుంచి 2023 మార్చి 15 వరకు రాష్ట్రమంతటా కాన్షీరామ్ 88 జన్మదిన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు. కాన్షీరామ్ జయంతి సందర్భంగా మార్చి 15న లక్ష మందితో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పాదయాత్ర ప్రారంభిస్తామనిచ చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యావంతులు, ప్రజాస్వామ్యవాదులు మద్దతు, సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి బొజ్జ అంజయ్య ,హైద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు మేడి కార్తిక్, విద్యార్థి విభాగ రాష్ట్ర కన్వీనర్ తాళ్ల అజరు మహారాజ్, కో కన్వీనర్లు చింత పరమేష్, తలారి లింగయ్య, కార్యవర్గ సభ్యులు కోక చరణ్, మోగిలిపాక శివ, ఇండనూరి హరికష్ణ విద్యార్థులు నాగరాజు, కోటేష్, సుమన్ పాల్గొన్నారు.