Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బందికి కోవిడ్-19 చికిత్సపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలతో 2 రోజుల శిక్షణ తరగుతులు నిర్వహిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు విప్రో జీఈ హెల్త్ కేర్ రూపేష్ కుమార్ వారి ప్రతిపాదన అని డాక్టర్ వికాస్ కష్ణ తెలిపారు. లోబో క్లినికల్ ట్రైనర్ అంజి, పబ్లిక్ హెల్త్ కేర్ ఇన్చార్జి సాధన బింద్రా ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు నిర్వహిస్తున్నారని ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. ఈ సందర్బంగా విప్రో జిఈ హెల్త్ కేర్ వారికి నిర్వహిస్తున్న ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి, సివిల్ సర్జన్ ఆర్ఎమ్ఓ 1 డాక్టర్ బి .శేషాద్రి, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎమ్ఓ లు డాక్టర్ టి సాయి శోభ, డాక్టర్ బి శ్రీనివాసులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఆర్‌ఎమ్‌ఓలు డాక్టర్ నరేంద్ర కుమార్, డాక్టర్ పి సుష్మా, డాక్టర్ కవిత, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.