Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పి. నర్సింహ్మరెడ్డి
నవతెలంగాణ-ఓయూ
విద్యారంగంలో విదేశీ పెట్టుబడులను అడ్డుకునే శక్తి విద్యార్థులకే ఉందని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పీ.నర్సింహారెడ్డి అన్నారు. శనివారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఓయూ ఐసీఎస్ఎస్ఆర్ హాల్లో రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీ జరిగింది. బిజిపిడికిలి జెండాను రాష్ట్ర అధ్యక్షుడు జూపక శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పీ నర్సింహా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ పాలకులు వాళ్ల స్వార్ధ్ధ ప్రయోజనాల కోసం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ కార్పొరేట్ సేవకులుగా మారారని, విదేశీ పెట్టుబడులను అడ్డుకునే శక్తి కేవలం విద్యార్థులపై ఉందని అన్నారు. పాలకులు విద్యను వ్యాపారం చేశారని, విదేశీ పెట్టుబడులకు, విదేశీ యూనివర్శిటీలకు వ్యతిరేకంగా పోరాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గడిచిన ఏడేండ్లలో వందలాది మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్న చలించని కేసీఆర్ నేడు అసెంబ్లీ సాక్షిగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని ప్రకటించడం విడ్డురంగా ఉందని, ఎన్నికల ప్రచారంలో భాగమేనని తెలిపారు. బిశ్వాల్ నివేదిక ప్రకారం ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలను ప్రకటించి విడుదల చేయాలని పిలుపునిచ్చారు. లేనిపక్షంలో విద్యార్థి యువతరం ప్రభుత్వాలపై పోరాటాలు తీవ్రతరం చేయాలని కోరారు. ఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి ప్రదీప్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మతం ముసుగులో దేశాన్ని తాకట్టు పెడుతుందని, ఫాసిజం భావజాలాన్ని విద్యార్ధి యువకులు బలవంతంగా చూపిస్తుందని దీన్ని విద్యార్థులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ప్రగతిశీల మానవ విలువలను పెంపొందించే భావజాలాన్ని విద్యార్థిలోకం పైన అందించాలని కోరారు. జాజిరెడ్డి, జంపాల, శ్రీపాద లాంటి అనేకమంది విద్యార్థి అమలులో అందించిన స్ఫూర్తితో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందూరు సాగర్, సహాయ కార్యదర్శి గౌతమ్ ప్రసాద్, శ్రీకాంత్, పి మహేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం శ్యామ్, సిద్దిపేట శ్రీకాంత్, పోలే కిరణ్, చందర్రావు, రెడ్డి చరణ్, తిరుపతి, వినోద్, రాజేశ్వర్, నూనె సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.