Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
బాపునగర్‌లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్ అన్నారు. కార్పొరేటర్ విజరుకుమార్గౌడ్ శనివారం బాపునగర్‌లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్ధానికులు బస్తీలో సీసీ రోడ్ల నిర్మాణంపై కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు ఈఈ శంకర్, ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గతో పాటు స్థానిక బస్తీ ప్రజలు సలీం, రషీద్, శాబాజ్, ఫరీద్, ఇంతియాజ్, ఖయ్యుం, టీఆర్ఎస్ నాయకులు రంగు సతీష్‌గౌడ్, సంతోష్‌చారి తదితరులు పాల్గొన్నారు.