Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని బాగ్ అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అన్నారు. శనివారం బాగ్ అంబర్‌పేట డివిజన్ శ్రీనివాస్‌నగర్ కాలనీలో జరుగుతున్న సిమెంట్ రోడ్డు పనులను, వడ్డెర బస్తీలో జరుగుతున్న మంచినీటి పైపులైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మ్రాట్లాడుతూ రోడ్లు, డ్రయినేజీ సమస్యల పరిష్కారానికి దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. డివిజన్లోని సమస్యలును తమ దష్టికి తీసుకువస్తే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్చార్జ్ వెంకట్‌రెడ్డి, డివిజన్ ధ్యక్షులు చుక్క జగన్, ప్రధాన కార్యదర్శి కోడూరు సురేష్, మిర్యాల శ్రీనివాస్, నరసింహ, కిషోర్ కుమార్, సతీష్ గుప్తా, జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, వర్క్ ఇన్స్పెక్టర్ రవినాయక్ పాల్గొన్నారు.