Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీసం నీరు కరువు అంటూ విద్యార్థుల ఆందోళన
- వసతిగహాన్ని పరిశీలించిన ఇన్స్పెక్టర్
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ1, ఈ2, బీఈడీ వసతిగహాలకు సంబంధించిన విద్యార్థులు శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓయూ లేడీస్ హాస్టల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వీరికి మద్దతుగా ఓయూ ఎస్ ఎఫ్ఐ కార్యదర్శి రవి నాయక్, పీడీఎస్‌యూ (విజంభణ), రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లూరి విజరు పాల్గొన్నారు. వసతిగహంలో ఉన్న కనీస వసతుల కల్పనలో విఫలం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలు పరిష్కరించాలని గతంలో ఓయూ వీసీ, రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్స్‌కు పలుమార్లు విన్నవించామని, కానీ పరిష్కారం కాకపోవడంతో గత్యంతరం లేక ఇలా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. వసతిగహంలో తక్షణమే నీరు, విద్యుత్ సరఫరా చేయాలని, కనీసం నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. విద్యార్థులు రాస్తారోకోను అధికారులు పట్టించుకోక పోవడంతో విద్యార్థులు పరిపాలనా భవన్‌కు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి నేత అల్లూరి విజరు, అఖిల్, అంజయనేయలు లను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థుల విజ్జప్తి మేరకు ఓయూ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ వసతిగహంలో పర్యటించి విద్యార్థులు ఆవేదన విన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు మేథిలాల్, సైయ్యద్, తిరుమలేష్, ప్రశాంతు, మనోజ్, లింగస్వామి, కష్ణ, సుధీర్, అనిల్, అఖిల్ నరేష్ పాల్గొన్నారు. అరెస్ట్ అయిన విద్యార్థులను పోలీసు స్టేషన్లో విద్యార్థి నేత చేనాగని దయాకర్ పరామర్శించారు.