Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, జగద్గిరిగుట్ట
ఏండ్లుగా పని చేస్తున్న కార్మికులను అకారణంగా తొలగించారని వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని సీఐటీయూ జీడిమెట్ల గాంధీనగర్ పారిశ్రామిక ప్రాంత అధ్యక్ష కార్యదర్శులు కీలుకాని లక్ష్మణ్, వి.ఈశ్వర్రావు అన్నారు. అకారణంగా తొలగించిన ఐఈపీఎల్ కార్మికులకు న్యాయం చేయాలని జీడిమెట్ల పారిశ్రామికవాడలో కార్మికులు చేపట్టిన ఆందోళన శనివారం నాటికి 10వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న కార్మికులకు సూపర్మాక్స్ కార్మికులతో పాటు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్‌లు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 10 రోజులుగా ఆందోళన చేస్తున్న యజమాన్యం చర్చలకు పిలవకుండా కాలయాపన చేస్తుందన్నారు. అక్రమంగా తొలగించిన కార్మికులకు చట్టపరంగా న్యాయం చేయాలన్నారు. కంపెనీలో పని చేస్తున్న కొంత మంది మేనేజర్లు వారి స్వలాభం కోసం కంపెనీ యండిని పక్క దారి పట్టిస్తూ కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు కార్మికులకు చట్టప్రకారం న్యాయం చేయాలని, లేని పక్షంలో లేని పక్షంలో జీడిమెట్ల ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కంపెనీ ముందు ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు బీరప్ప, సాయి, శ్రీనివాస్, రాంబాబు, కంపెనీ కార్మికులు వేణుగోపాల్, వీరంశెట్టి, సూపర్మాక్స్ యూనియన్ కార్మిక నాయకులఱు ఈశ్వర్రావు, రాజిరెడ్డి, సదానందం, వెంకటేశ్వర్రావు, నరేందర్, కుమార స్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.