Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తను కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జి మాధవరం కాంతా రావు శనివారం పరామర్శించారు. ప్రశాంత్‌నగర్ రాజీవ్ గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న మోహిజ్, అదే కాలనీలో నివాసం ఉంటున్న కొందరు యువకులతో గొడవ జరి గింది. దీంతో ఇరువర్గాల యువకులు ఒకరినొకరు ఇను పరాడ్లతో, ఇటుకలతో దాడులు నిర్వహించుకోవడంతో మొహిజ్కు గాయాలయ్యాయి. సమస్యలను సామరస్యం గా పరిష్కరించుకోవాలన్నారు. గొడవల వల్ల కుటుంబాలు నష్టపోతాయనీ, ఘర్షణలు పడొద్దని సూచించారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీనగర్ డివిజన్ అద్యక్షులు వినోద్, వి.వి నగర్ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ రావు పాల్గొన్నారు.