Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
పట్టణ ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వసతులు కల్పించి రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని కార్పొ రేటర్ గీత అన్నారు శనివారం ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆమె సంద ర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యశాలలో లేబర్ రూమ్తో పాటు ఇతర గదులను పరిశీలించారు అక్కడే ఉన్న గర్భిణీలతో వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో ప్రతి గదినీ సైతం వదలకుండా వైద్య సిబ్బందితో కలిసి కలియతిరిగారు. వైద్యశాల పరిశుభ్రంగా ఉండాలని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు అంతేకాకుండా వైద్యశాలలో విద్యుత్ లైట్లు లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని తెలపడంతో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు మాట్లాడి ఏర్పాటు చేస్తానని కార్పొరేటర్ చెప్పారు. ఈ సందర్భంగా కార్పోరేటర్ తన శాలరీతో వైద్యశాలలో కలర్ టివిని ఏర్పాటు చేసినందుకు వైద్య సిబ్బంది ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. అనంతరం పిహెచ్సి డాక్టర్ సౌందర్యలతో పలు అంశాలను చర్చించారు. వైద్యశాలలో ఎవరికీ ఏ సమస్య వచ్చినా తనకు తెలపాలనీ తీర్చేందుకు కషి చేస్తానని హామీ ఇచ్చారు.