Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాదర్గుల్లో సీసీి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
- మేయర్ పారిజాత నర్సింహ్మా రెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కషి చేస్తున్నామని బడంగ్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మారెడ్డి అన్నారు. శనివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని 8వ డివిజన్లోని వెంకటేశ్వర కాలనిలో సీసీ రోడ్డు, డ్రైనేజి నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ గూడెపు ఇంద్రసేనతో కలసి మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివద్ధి పనులను త్వరగా పనులను పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు మర్రి జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ బీసీ సెల్ అధ్యక్షులు కె.జంగయ్య, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.