Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమావేశం జరుగుతుండగా టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి జేబులో 20 వేలు
- కమిషనర్ జేబులో 15 వేలు చోరీ
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
పెద్ద అంబర్‌పేట మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీకి తాగునీరు అందిస్తానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దఅంబర్‌పేట మున్సి పాలిటీ 23వ వార్డులో రూ.48కోట్లతో చేపట్టిన తాగునీరు పైపు లైను, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధి లోని నాలుగు గ్రామపంచాయతీలకు సుమారుగా 150 కిలోమీటర్ల పరిధిలో ప్రతి కాలనీకి తాగునీరు అందించడానికి 48కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని తుర్కయం జాల్ మున్సిపాలిటీ 92 కోట్లు, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ 48 కోట్లు, ఆదిభట్ల మున్సిపాలిటీికి 18 కోట్లు తాగునీటి కోసం నిధులు మంజూరైనట్లు తెలిపారు. నిర్మాణం పనులు హెచ్‌ఎండీిఏ ఆధ్వర్యం లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ కౌన్సిలర్లు డుమ్మా : మున్సిపల్ పరిధిలోని 48 కోట్ల అభివద్ధి పనులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్ర మానికి మున్సిపల్‌కు చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్లు డుమ్మా కొట్టడంతో ప్రజల్లో విమర్శలు గుప్పుమన్నాయి. అన్ని వార్డులకు సంబం ధించిన అభివద్ధి కార్యక్రమానికి బాధ్యతగా రావా ల్సిన కౌన్సిలర్లు అందుకు భిన్నంగా వ్యవహరించడం దారుణం అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివద్ధి పనులు చేయాలని ప్రజల కోరారు. కానీ ఇలాంటి అభివద్ధి కార్యక్రమానికి కొందరు దూరంగా ఉండడంతో మున్సిపల్ పరిధిలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జేబులకు చిల్లులు : అభివద్ధి పనులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రారంభిస్తున్న దశలో కార్యకర్త లు ఒత్తిడి ఎక్కుగా ఉండడంతో అదే అదునుగా భావించిన దుండగులు టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్యదర్శి పాశం దామోదర్ జేబులో నుంచి రూ.20 వేలు, మున్సిపల్ కమిషనర్ జేబులో నుంచి రూ.15 వేలు చోరీ చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు టీఆర్ఎస్ నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకపక్క పోలీసులు, మరోవైపు భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు హడావిడిగా ఉన్న దశలో ఇలాంటి చోరీ జరగడం గమనార్హం. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ చెవుల స్వప్న, చిరంజీవి, కమిషనర్ అమరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు సిద్దంకి కష్ణా రెడ్డి, విద్యావతి విజేందర్ రెడ్డి, కందాడి అనుపమ సుప్రసేనారెడ్డి, రోహిణిరెడ్డి, పాశం అర్చన దామోదర్, మోతే మన్నెమ్మ, దండెం కష్ణారెడ్డి, టీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.