Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయభ్రాంతులు గురైన కాలనీవాసులు
నవతెలంగాణ-వనస్థలిపురం
మత శిశువు తల భాగాన్ని నోట కరచుకుని వీధి కుక్క కాలనీలో సంచరించడంతో కాలనీవాసులు భయభ్రాం తులకు గురయ్యారు. దీంతో కాలనీవాసులు కుక్కని తరిమి వేయడంతో తల భాగాన్ని చెట్ల పొదల్లో వదిలి వెళ్లిపోయింది. వెంటనే కాలనీవాసులు కంట్రోల్ రూమ్కి సమాచారం అందించడంతో వనస్థలిపురం పోలీసులు రంగప్రవేశం చేశారు. మత శిశువు తల భాగం ఆడ, మగ అన్నది నిర్ధారణ కాలేదు. రెండు రోజుల క్రితం జన్మించినట్లు ప్రాథమిక నిర్ధారణలో పోలీసులు పేర్కొన్నారు. మొదల మధ్య పడి ఉన్న మత శిశువు తల భాగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందజేశారు. ఈ మేరకు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పుట్టగానే పసికందులు కుక్కల పాలు చేశారు : కాలనీవాసులు
పుట్టగానే తల్లి ఒడిలో పాలు తాగాల్సిన, అన్యం పుణ్యం ఎరుగని పసికందును వీధి కుక్కల పాలు చేయటం ఘోరమైన చర్య అని కాలనీవాసులు కంటతడి పెట్టుకుంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. మత శిశువు తల భాగం ఆడా, మగా తెలియని పరిస్థితి నెలకొందని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కాలనీవాసులు కోరారు.