Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ముస్లిం శ్మశానవాటిలో మౌలిక వసతులు కల్పిస్తామని హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ అన్నారు. ఆదివారం ఓయూలో ముస్లింల శ్మశాన వాటికను పరిశీలించారు. శ్మశాన వాటికలో వీధిదీపాలు కావాలని, చెత్తచెదారం తీసివేయాలని రోడ్లు మరమ్మతులు చేయాలని, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ముస్లింపెద్దలు కార్పొరేటర్‌ను కోరారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందిస్తూ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆమె వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈ నాగమణి, శ్మశానవాటిక అధ్యక్షుడు ఖాజ మోహినుద్ధున్, ఉపాధ్యక్షుడు యూసఫ్, ప్రధాన కార్యదర్శి ఖలీద్, సంయుక్త కార్యదర్శి హుస్సేన్, కోశాధికారి ఖాజ శామ్స్, హుస్సేన్, అబ్దుల్ వాహిబ్, బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి, బానోత్ రమేష్ నాయక్ పాల్గొన్నారు.