Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ కార్డులను అన్ని రకాల కార్మికులు తీసుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బాల నరసింహ స్వామి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ప్రమీల అన్నారు. ఆదివారం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ ఆశయ్య నగర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో సుమారు 150 మందికి ఈ-శ్రమ్ కార్డులు పంపిణీచేశారు. ఈ కార్డు ఉన్నవారికి పనిచేసే ప్రదేశాల్లో ప్రమాదానికి గురై, అంగవైకల్యం చెందితే లక్ష రూపాయలు, మరణిస్తే రెండు లక్షల రూపాయలు బీమా ఉంటుందని అన్నారు. ఈ కార్డు పొందుటకు 20 నుంచి 56 ఏండ్ల వరకు వయస్సు కలిగి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ జె. స్వామి, నాయకులు ఏ ఆర్ నరసింహ, బాలయ్య, లక్ష్మణ్, భాగ్యరాజు, రాము, దేవదాస్, సువర్ణ, సమాధానం, బుజ్జమ్మ, తదితరులు పాల్గొన్నారు.