Authorization
Tue March 18, 2025 12:51:42 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. ఆదివారం జీడిమెట్ల డివిజన్ పరిధిలొని రాఘవేంద్ర కాలనీలో కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలను జోనల్ కమిషనర్ మమతకు ఫోన్ చేసి తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవని, కాలనీలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. బీజేపీ కార్పొరేటర్లకు నిధులు మంజూరు చేయడం లేదన్నారు. కాలనీలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు అరుణ్, నాయకులు శ్రీకాంత్, శ్రీధర్ వర్మ, జయశంకర్‌గౌడ్, రాములుగౌడ్, నాగరాజు, మల్లేష్‌గౌడ్, కోటేశ్వరరావు, శ్రీనివాస్, నారాయణ, నారాయణగౌడ్, నాయుడు, మాధవరెడ్డి, మధుసూదన్, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.