Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూకట్పల్లి అసెంబ్లీ బీజేపీ ఇన్చార్జి మాధవరం కాంతారావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ/కూకట్పల్లి
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కూకట్పల్లి అసెంబ్లీ బీజేపీ ఇన్చార్జి మాధవరం కాంతారావు అన్నారు. ఆదివారం బాలాజీనగర్ డివిజన్ పరిధిలొని రోడ్డు నంబర్ 2లో డివిజన్ బిజేపీ అధ్యక్షులు జి.వినోద్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం మహిళా దినోత్సవం వారోత్సవాలను పురస్కరించుకుని పాఠశాల మహిళా సిబ్బందిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనిషికి మంచి ఆరోగ్యం సాధ్యమని బీజేపీ ఇన్చార్జి మాధవరం కాంతారావు, మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్ అన్నారు. ఆదివారం మూసాపేట్ డివిజన్ మోతినగర్‌లో స్థానిక నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో వారు మాట్లాడారు. సమాజంలో మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మానవుని జీవితంలో ఒక భాగమేనని, ప్రతి పౌరుడు కూడా స్వచ్ఛ భారత్‌లో పాల్గొని, తమ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సమాజానికి తమవంతు సహాయం అందించాలని సూచించారు. మోతీనగర్‌లోని పబ్లిక్ పార్క్, బస్తీ దవాఖానలో పేరుకుపోయిన చెత్తాచెదరాన్ని శుభ్రం చేశారు. కార్యక్రమంలో మూసాపేట్ డివిజన్ అధ్యక్షుడు మనోహర్, డివిజన్ ఇన్చార్జ్ వినోద్ లతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.