Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకులాభరణం కష్ణమోహన రావు
నవతెలంగాణ-కల్చరల్
నవయుగ సాహితీ వైతాళికుల్లో గురజాడ, రాయప్రోలు ప్రముఖులని బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకులాభరణం కష్ణమోహన రావు అన్నారు. శ్రీ త్యాగరాయ గాన సభలో ఆదివారం ఎందరో మహానుభావులు శీర్షికన నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా రాయప్రోలు సుబ్బారావు జయంతి సభ జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ కష్ణ మోహన రావు పాల్గొని మాట్లాడుతూ 'ఏ దేశ మేగినా ఎందు కాలిగిన పొగడరా నీ తల్లి భూమి భారతావని' అనే కవితతో దేశ భక్తిని చాటుకున్న రాయప్రోలు జాతీయ కవిగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. భావ కవిత్యంలో ప్లేటోనిక్ లవ్(అమలిన శంగారం) సిద్ధాంతం ఆయన ప్రతిపాదించారని వివరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు తొలి శాఖాధిపతిగా నాటి నైజాం నవాబ్ పిలుపు మేర వచ్చి పనిచేశారని చెప్పారు. గాన సభ అధ్యక్షులు కళా జనార్దన మూర్తి అధ్యక్షత వహించిన సభలో కవి రఘుశ్రీ, వైఎస్ఆర్.మూర్తి, శ్రీమణి పాల్గొన్నారు.