Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్లాంట్ బేస్డ్ నానో టెక్నాలజీని ఉపయోగించి క్రానిక్ వ్యాధులను రివర్స్ చేయగల చికిత్సల కోసం గచ్చిబౌలిలోని రాధాస్ ఆయుర్వేద హాస్పిటల్లో 'ఫ్రీడమ్ ఫ్రమ్ క్రానిక్ డిసీజెస్' కార్యక్రమంలో భాగంగా ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపులో పక్షవాతం, లాంగ్ కొవిడ్ సమస్యలు, అన్ని రకాల క్యాన్సర్లు, డయాబెటిస్, దాని అనుబంధ సమస్యలైన న్యూరోపతి, నెఫ్రోపతి, రెటినోపతి, గ్యాస్ట్రిక్ సమస్యలు, డుయోడినల్ అల్సర్లు, అధిక ఒత్తిడి సమస్యలు, నిద్రలేమి ( నిద్రలో సమస్యలు), డయాబెటిక్ ఫూట్ అల్సర్లు (సరైన చికిత్స ద్వారా కాలు తీయాల్సిన ప్రమాదం నుంచి బయట పడొచ్చు), నరాల సంబంధి సమస్యలు, దీర్ఘకాలం వేధిస్తున్న నొప్పులు, కీళ్ల నొప్పులు (ఆస్టియా ఆర్థరైటీస్), సంతానలేమి సమస్యలు (స్త్రీ, పురులుషులు ఇద్దరు), కిడ్నీలో రాళ్లు, గాయాలు మానకపోవడం, అల్సర్ మానడంలో సమస్య, పీసీఓఎల్ లేదా పీసీఓడీ, స్పాండిలోసిన్ ( దీర్ఘకాలం వేధించే మెడ, నడుము నొప్పులు) లాంటి సమస్యలతో బాధపడుతన్న వారికి చికిత్స అందించారు. రాధాస్ ఆయుర్వేద వైద్యులు, అంతర్జాతీయ స్థాయి ఆయుర్వేద వైద్యులు, ప్లాంట్ బేస్డ్ నానో టెక్నాలజీ పరిశోధకులైన డాక్టర్ బి.శ్రీనివాస్ అమర్నాథ్ కూడా ఈ క్యాంపు అందుబాటులో ఉన్నారు. ఉచిత కన్సల్టేషన్లతోపాటు మహా మృత్యుంజయ ఫార్మసీ ద్వారా ఉచితంగా మందులను అందజేశారు.