Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరిం చాలని కాంగ్రెస్ నాయకుడు మంచాల ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం కీసర మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వారం వారం పూలమాల కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనం తరం ఆయన మాట్లాడుతూ దేశం గర్వించ దగ్గ గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కీసర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎం.రవీందర్, శీలం శ్రీనివాస్, రొండ్ల కృష్ణ, కూరం రాము, శ్రీరాములు, కొమ్ము మల్లేష, ఎంప ీటీసీ వెంకటరెడ్డి, గరుగుల మల్లేశ్, వార్డ్ సభ్యులు శీలం మల్లేష్, మంకి రాజు, తుడుం శ్రీనివాస్, ఆనంద్ రావు, పుండ్రు మల్లేశ్, నర్సింహ, కిరణ్, శ్రీకాంత్, బంటు అరవి ంద్, మేకల మహేష్, గంగి శ్రీకాంత్, మల్లేశ్, నర్సింహ, నరేంద్ర, ఎర్ర సాయిలు, ఆంజనేయులు, ముద్ధం పెంటేష్, బొడా నర్సింగరావు, దాయరా భిక్షపతి, సంతోష్, లాలయ్యా, అర్జున్, అంబేద్కర్ అభిమానులు, పాల్గొన్నారు.