Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
తాము వైద్య విద్యార్థులుగా ఉన్నప్పుడు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున అనేక ఉద్యమాలు చేపట్టామని తెలంగాణ ఎంప్లాయాస్ అసోసియేషన్, డాక్టర్స్ ఫోరం చైర్మెన్ డాక్టర్ పురుషోత్తం అన్నారు. నేడు ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగస్తులు ప్రశ్నించేతత్వాన్ని కోల్పోయారనీ, ప్రశ్నిస్తేనే పరిస్థితులు మారుతాయని తెలిపారు. హెల్త్ కేర్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో నల్లకుంటలోని ఆర్టీసీ కల్యాణ వేదిక ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన ప్రజారోగ్య పరిరక్షణ సభలో పురుషోత్తం పాల్గొన్నారు. రాష్ట్రంలో వైద్య విద్య, వైద్య వ్యవస్థ గాడి తప్పుతున్న వైనాన్ని గురించి ప్రసంగించారు. వైద్యరంగంలో రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రభుత్వం నియమకాలు చేపట్టకపోవడం, ఉన్నతమైన ప్రతిష్టాత్మకమై న రాష్ట్ర హెచ్ఓడీలైన డీహెచ్, డీఎంఈలను ఇన్చార్జి లుగా కొనసాగించడం, పాతబడిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ భవనాన్ని కొత్తగా నిర్మించక పోవడం, ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్యులు, వైద్య సిబ్బంది మీద దాడులు జరగడం లాంటి అంశాలపై ప్రసంగించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మరింత పటిష్టంగా ప్రజా ఆరోగ్య వ్యవస్థ ను బలపరిచేందుకు చర్యలు చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీజేపీ అధికార ప్రతినిధి ఝాన్సీ లక్ష్మీబాయి, ఎమ్మెల్సీ నరసింహా రెడ్డి, ప్రొఫెసర్ విశ్వేశ్వర, ఐఎన్ఏ రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షురాలు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ టిడాక్టర్స్ అసోసియేషన్, తదితర వైద్య సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.