Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ఎన్టీఆర్ నగర్ కాలనీ కమిటీ హాల్లో ఐద్వా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మెడికల్ క్యాంప్ సేవ్ హాస్పిటల్ వారి సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. గైనకాలజీ జనరల్ ఫిజీషియన్ ఆర్తో ఆర్థోపెటిక్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్స్, వారి సిబ్బంది సుమారు 200 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఎస్ రాజి రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తామన్నారు. సేవ్ హాస్పిటల్కి వచ్చిన వారికి 30 శాతం రాయితీ ఇస్తామనీ, మందుల్లో 10 శాతం రాయితీలు ఇస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.సజన, ఎం.వినోద, జిల్లా ఉపాధ్యక్షులు బి.మంగ, జిల్లా కోశాధికారి సపియ సుల్తానా పద్మావతి, మనోజ, విజయ నాగమణి తదితరులు పాల్గొన్నారు.