Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ కార్మిక సంఘాల నాయకుల పిలుపు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 28, 29న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని జాతీయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం షాపూర్‌నగర్‌లోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన కార్మిక సదస్సుకు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.యేసురత్నం, ఐఎన్టీయూసీ అధ్యక్షులు ఐలయ్య, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, అనురాధలు పాల్గొని మాట్లాడారు. మోడీ అధికారంలోకి వచ్చకా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు వారికి విక్రయిస్తూ లక్షలాది మందిని రోడ్డుపై పడేస్తున్నారన్నారు. 44గా ఉన్న కార్మిక చట్టాలను నాలుగు చట్టాలుగా మార్చి కార్మికులకు గతంలో ఉన్న కార్మిక జీత భత్యాల హక్కు, కార్మికులు ప్రమాద బీమా హక్కు, కార్మిక సంఘాల యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కులను తొలగించదని, వాటిని తిరిగి సాధించుకోవడానికి కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ లాంటి సౌకర్యాలు, పర్మినెంట్ ఉద్యోగాల కోసం కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి లక్ష్మణ్, సీపీఐ మండల కార్యదర్శి ఉమామహేష్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా కార్మికుల సమ్మె నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శంకర్రావు, ఈశ్వర్రావు, వజ్రమని, ఏఐటీయూసీ అధ్యక్షులు హరినాథ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్, శ్రీకాంత్, బీరప్ప, సత్యం, మహేష్, సుంకిరెడ్డి, దేవదానం, స్వాతి, శ్రీనివాస్, వెంకయ్య, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.