Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
రోబో శ్రీను అధ్యక్షతన జరిగిన జూబ్లీహిల్స్ డివిజన్ ఎస్సీ మోర్చా కార్యవర్గ సమావేశానికి కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ జిల్లా ఎస్సీ మోర్చ ఉపాధ్యక్షుడు రవిబాబు హాజరై ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ దళితుల అభివధ్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతత్వంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకు వచ్చిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పార్టీ ప్రారంభమైన నాటి నుంచి దళితులే బీజేపీని భుజాన మోస్తున్నరాని చెప్పారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ అధికారమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షులు కస్తూరి మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు గడ్డం వెంకటస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, ఉపేందర్, జోసఫ్ శేఖర్, రవి, మధు పాల్గొన్నారు.