Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
రిజిష్ట్రేషన్ సమస్య ఉన్న బిఎన్‌రెడ్డినగర్, నాగోల్ డివిజన్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో ఆదివారం ఎమ్మెల్యే క్యాప్ ఆఫీస్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతు రిజిష్ట్రేషన్ సమస్యపై గత నెల రోజుల క్రితం ఇదే ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు అంగీకరిస్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రిపోర్టు అందజేయడం జరిగింది అన్నారు. సమస్య పరిష్కారానికి మరో అడుగు దూరంలో ఉండటంతో అదే విషయాన్ని మీ అందరితో పంచుకోవడం జరిగిందని పేర్కొన్నారు. కానీ ఈ సమస్య పరిష్కారం అయితే ఇక వారి రాజకీయ భవిష్యత్తు శూన్యం అని భావించి కొందరు సోషల్ మీడియా వేదికగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రస్తావించి పరిష్కరిస్తారా లేదా అంటూ ప్రచారం చేయడం సిగ్గుచేటు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సదరు ప్రశ్నను పంపించడం జరిగింది అన్నారు. కానీ సభా సమయాభావం వల్ల, అలాగే రానున్న వర్షాకాలాన్ని దష్టిలో ఉంచుకుని ఎస్ఎన్డిపి పనులపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది అన్నారు. ప్రశ్నకు సమయం కేటాయించకపోగా స్పీకర్‌ని జీరో అవర్‌లో అవకాశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేయగా ఆ సమయంలో ప్రస్తావించడం జరిగింది అన్నారు. ఈ రిజిస్ట్రేషన్ సమస్యపై నేను ఎన్నికలప్పుడు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్‌కు సంబందించిన 6 కాలనీ సమస్యపైనే హామి ఇచ్చినట్లు గుర్తు చేస్తూ బిఎన్‌రెడ్డి నగర్ కాలనీలతో పాటు నూతనంగా నాగోల్ డివిజన్ కాలనీల సమస్యను కూడా పరిష్కరించే దిశగా చేయని ప్రయత్నం లేదు అన్నారు. పలుమార్లు కాలనీ సంఘం ప్రతినిధులను కూడా మంత్రుల దగ్గరకు తీసుకువెళ్లి వారికి పూర్తి అవగాహన కల్పించి ఈ సమస్య పరిష్కారానికి కషి చేసిన విషయం మరోసారి గుర్తుచేసారు. మాట ప్రకారం ఎలాంటి అదనపు రుసుము లేకుండా చేయాలని చూడటం జరిగింది అన్నారు .రానున్న నాలుగైదు రోజుల్లో అందరినీ మరోసారి ఆహ్వానిస్తానని, కాలనీవాసులు అందరు కలిసి తనతో రావడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ బిఎన్‌రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, నాగోల్ డివిజన్ టీిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు చిరంజీవి, టీిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ చౌదరి, రాఘవేందర్ రావు, బి.ఎన్.రెడ్డి నగర్ మరియు నాగోల్ డివిజన్ నుండి పలువురు అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.